
బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు షురూ
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి వర్క్ పీపుల్ స్పొర్ట్స్, గేమ్స్ కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో కార్పొరేట్, కొత్తగూడెం ఏరియా ఉద్యోగులకు బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జీఎం (పర్సనల్) వెల్ఫేర్ (సీఎస్సార్) జీవీ కిరణ్‌కుమార్ హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఉద్యోగులు వారి పనులను నిర్వహిస్తూనే క్రీడల్లో ఆసక్తి చూపడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం క్రీడాకారులకు 2025 – 26 ఏడాదికి సంబంధించిన ఏకరూప దుస్తులు, క్రీడా సామగ్రి అందించారు. బాడి బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను ఈ నెల 23, 24 తేదీల్లో భూపాలపల్లి ఏరియాలో, షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలను ఈ నెల 25, 26 తేదీల్లో ఆర్‌జీ–3 ఏరియాలో జరిగే కంపెనీస్థాయి పోటీలకు ఎంపిక చేశామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏజే మురళీధర్‌రావు, కేసా నారాయణరావు, ఆర్.కేశవరావు, ఎస్‌వీ రమణమూర్తి, ఎస్.పితాంబరరావు, కె.సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.