
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ
మణుగూరుటౌన్: మున్సిపాలిటీలోని కమలాపురం గ్రామంలో వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకోగా.. ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. మున్సిపాలిటీలోని కమలాపురం వైపు నడుస్తున్న ఇసుక రీచ్‌లకు వెళ్లే లారీలు అధిక వేగంతో వెళ్తుండటంతో రోడ్లు పాడవుతున్నాయని స్థానికులు ఇటీవల రాకపోకలను అడ్డుకున్నారు. అధికారుల సూచనలతో లారీల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇసుక రీచ్‌లకు వెళ్లే లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం పూర్తిగా కిందపడకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇప్పటికై నా ఇసుక తరలింపునకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తృటిలో తప్పిన ప్రమాదం