
సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
కొత్తగూడెంటౌన్: ప్రతీ కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో సోమవారం ఆయన పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసుల పరిష్కారంలో బాధ్యతగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గంజాయి, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అన్ని స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను (బ్లాక్ స్పాట్‌లను) గుర్తించి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదుల సహకారం తీసుకోవాలన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, సతీష్‌కుమార్, రవీందర్‌రెడ్డి, చంద్రభాను తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజు