
రాజ్యలక్ష్మి మోటార్స్‌లో షార్ట్ సర్క్యూట్
పాల్వంచ: పట్టణంలోని బీసీఎం రోడ్‌లో ఉన్న రాజ్యలక్ష్మి మోటార్స్‌లో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో మంటలు వ్యాపించి షోరూం నుంచి దట్టమైన పొగ వస్తుండటంతో స్థానికులు గుర్తించి నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని షట్టర్లు తెరిచి చూడగా, భారీ ఎత్తున మంటలు చెలరేగుతున్నట్లు గుర్తించారు. నిర్వాహకుల సమాచారంతో కొత్తగూడెం నుంచి ఫైర్ ఇంజన్‌తో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే మంటల్లో కొత్త, పాత వాహనాలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు శ్రీనివాస్ తెలిపారు. పూర్తి అంచనా వేయాల్సి ఉందన్నారు.
రూ.20 లక్షల విలువైన
కొత్త, పాత వాహనాలు దగ్ధం