
వర్షానికి కొట్టుకుపోయిన వేరుశనగ చేలు
అశ్వారావుపేట: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అశ్వారావుపేట మండలంలోని పలు వ్యవసాయ క్షేత్రాలు నీట మునుగుతున్నాయి. పండువారిగూడెం గ్రామానికి చెందిన కలిదిండి వెంకట నర్సింహ రాజు 40 ఎకరాల్లో వేరుశనగ నాటేందుకు చేను సిద్ధం చేసుకున్నాడు. శుక్రవారం నాటికి 20 ఎకరాలు విత్తనాలు వేశారు. ఆ తర్వాత వర్షం రావంతో 20 ఎకరాల్లో వేరుశనగ విత్తనాలు కొట్టుకుపోయాయి. ఎకరానికి రూ.50 వేలు చొప్పున రూ.10 లక్షలు నష్టపోయినట్లు రైతు వాపోతున్నాడు. రామన్నగూడెం, నారాయణపురం గ్రామాల్లో కూడా వేరుశనగ చేలు నీట మునిగాయి. వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించి నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఎకరానికి రూ. 50 వేల చొప్పున నష్టం