
ఉమ్మడి జిల్లా మార్కెట్ చైర్మన్ల ఫోరం ఏర్పాటు
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం ఏర్పాటైంది. రాష్ట్ర ఫోరం తరహాలో ఉమ్మడి జిల్లా ఫోరంను ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 14 మార్కెట్లకు గాను తొమ్మిది మార్కెట్లకు పాలకవర్గాలు ఉన్నాయి. ఈ మేరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సమావేశమైన చైర్మన్లు ఫోరం ఏర్పాటు చేసుకున్నారు. ఫోరం గౌరవ అధ్యక్షుడిగా ఖమ్మం ఏఎంసీ చైర్మన్ యరగర్ల హన్మంతరావును ఎన్నికయ్యారు. అలాగే, అధ్యక్షుడిగా బండారు నరసింహారావు(మధిర), ఉపాధక్షులుగా బాగం నీరజ(కల్లూరు), కార్యదర్శిగా దోమ ఆనంద్‌బాబు(సత్తుపల్లి), సహాయ కార్యదర్శిగా టి. సీతమ్మ(భద్రాచలం),, కోశాధికారిగా ఇరుప శ్రీనివాసరావు(చర్ల)ను ఎన్నుకున్నారు. త్వరలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి విధులు నిర్వర్తిస్తామని హన్మంతరావు తెలిపారు.
గౌరవ అధ్యక్షుడిగా హన్మంతరావు