
న్యూఢిల్లీలో ఉపాధ్యాయుల సాంస్కృతిక ప్రదర్శన
దుమ్ముగూడెం : సీసీఆర్‌టీ న్యూఢిల్లీలో జరుగుతున్న ఎన్‌ఈపీ–2020 శిక్షణలో సోమవారం మండలంలోని పెదపాడు ఎంపీపీఎస్ ఉపాధ్యాయుడు ఎం.మోహన్‌కుమార్ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ కళలు, విద్య, ఆహార విధానం, సంస్కృతి తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రం నుంచి హాజరైన ఉపాధ్యాయులు తెలంగాణ సంప్రదాయ వేషధారణలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు.
‘ఐకార్’లో అశ్వారావుపేట విద్యార్థుల ప్రతిభ
అశ్వారావుపేట: ఐకార్ నిర్వహించే జాతీయ స్థాయి అగ్రికల్చరల్ పీజీ ప్రవేశ పరీక్షలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల 2021 బ్యాచ్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే హేమంత కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏఐఈఈ పీజీ 2025 ప్రవేశ పరీక్షలో దనసరి నాగ చైతన్య శభరి (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్)లో ఆల్ ఇండియా 10వ ర్యాంకు, కేటగిరీలో 1వ ర్యాంకు, బండ అఖిల్ కీటక శాస్త్రంలో 11, 2 ర్యాంకులు, హలావత్ చిన్నారి అగ్రానమీ)లో 64, 02, తిప్పా నాగ వినయ్‌కుమార్ ప్లాంట్ సైన్సెస్ 166, 73, రమావత్ కళ్యాణి కీటకశాస్త్రంలో 187, 06, మృత్తిక శాస్త్రంలో షేక్ సఫీనా 60, 24, దేవరసెట్టి యమున 104, 49, మద్దెల యామని 131, 33 ర్యాంకులు సాధించినట్లు వివరించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పలువురు అభినందించారు.
ఉపాధి హామీ పనులపై ప్రజావేదిక
కరకగూడెం: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సోమవారం ప్రజావేదిక నిర్వహించారు. డీఆర్డీవో ఏపీడీ ఎన్.రవి, విజిలెన్స్ ఆఫీసర్ రమణారావు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావేదిక ఏర్పాటు చేశారు. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు మండలవ్యాప్తంగా 16 గ్రామ పంచాయతీల్లో రూ.5,94,54,175 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులు చేపట్టినట్లు వారు వెల్లడించారు. ఆ పనుల్లో గుర్తించిన లోపాలకు సంబంధించి ఆయా పంచాయతీలపై రూ.55,261 రికవరీకి ఆదేశించారు. రూ.11,000 పెనాల్టీ విధించారు. పంచాయతీ కార్యదర్శులు పని ప్రదేశంలో కూలీల మస్టర్లపై రోల్ కాల్ చేయకపోవడం, హాజరు గణనలో తప్పిదాలు, మస్టర్లపై అధికారుల సంతకాలు లేకపోవడం, పనుల ప్రదేశాల్లో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వంటి లోపాలను గుర్తించారు. 4వ విడత సామాజిక తనిఖీల్లో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అధికారులు గ్రామాల్లో పర్యటించి చేసిన ఉపాధి పనులను తనిఖీ చేసి, గ్రామసభల ద్వారా ప్రజలకు సమాచారం అందించారు. ఎంపీడీఓ కుమార్, ఎంపీఓ మారుతీ యాదవ్ పాల్గొన్నారు.
ఆదివాసీ విద్యార్థినికి
బంగారుపతకం
కారేపల్లి: మండలంలోని తొడితలగూడేనికి చెందిన ఆదివాసీ విద్యార్థిని ఎట్టి ప్రియకు బంగారు పతకం లభించింది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ నుంచి బీఈడీ పూర్తిచేసిన ఆమె యూనివర్సిటీ స్థాయి ఫలితాలు సాధించడంతో బంగారు పతకం ప్రకటించారు. ప్రియ తండ్రి రమణ ఆమె చిన్నతనంలోనే మృతిచెందగా, తల్లి కోటేశ్వరి కూలి పనులకు వెళ్తూ చదివించింది.
అటవీ జంతువుల వేటకు కరెంట్ ఉచ్చులు
కామేపల్లి: అటవీజంతువులను వేటాడేందుకు కరెంట్ ఉచ్చులు ఏర్పాటు చేయగా, కామేపల్లి మండలంలో అధికారులు గుర్తించారు. మండలంలోని హరి శ్చంద్రాపురం శివారు పంట చేలల్లో జంతువులను వేటాడేందుకు గుర్తు తెలియని వ్యక్తులు 11 కేవీ విద్యుత్ లైన్ నుంచి నేరుగా వైర్లను అమర్చారు. ఈ నేపథ్యాన విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడంతో ఉద్యోగులు పరిశీలిస్తుండగా ఉచ్చులు బయటపడ్డాయి. దీంతో అటవీ అధికారులకు సమాచా రం ఇచ్చి వైర్లను తొలగించారు. కాగా, ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

న్యూఢిల్లీలో ఉపాధ్యాయుల సాంస్కృతిక ప్రదర్శన