
విద్యార్థినులకు పౌష్టికాహారం
భద్రాచలంటౌన్: బీఈడీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికరమైన ఆహారం అందిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. పట్టణంలోని బీఈడీ కళాశాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థినులకు వడ్డించే ఆహారాన్ని పరిశీలించారు. మెనూ అమలు, కళాశాలలోని సమస్యలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ చికెన్ సరఫరాలో ఆలస్యం కావడంతో కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది వంట విషయంలో అశ్రద్ధ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వారిని తొలగించి కొత్తవారిని నియమించాలని ఏటీడీఓకు సూచించారు. కార్యక్రమంలో భద్రాచలం ఏటీడీఓ అశోక్ కుమార్, టీఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్