
భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సచివాలయం నుంచి రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, జిల్లా అటవీ శాఖాధికారి కృష్ణాగౌడ్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, తిరస్కరణకు గురైతే కారణాలను పొందుపర్చాలని ఆదేశించారు. ఐదు రోజుల్లో పూర్తి నివేదిక అందజేయాలన్నారు. ఆగస్టు 15 నాటికి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుల పరిష్కారం పూర్తి కావాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వన మహోత్సవం లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. దీనికి అవసరమైన సహాయ సహకారాలను అటవీ శాఖ నుంచి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ డీడీ మణెమ్మ, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, ఎస్సీ సంక్షేమాధికారి అనసూయ, బీసీ సంక్షేమాధికారి ఇందిర, డీఈఓ వెంకటేశ్వరాచారి, పౌరసరఫరాల శాఖ డీఎం త్రినాథ్‌బాబు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన గ్రంఽథాలయ చైర్మన్
జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా నియమితులైన పసుపులేటి వీరబాబు మంగళవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధిపై చర్చించారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్