మహాలక్ష్మీ కటాక్షం | - | Sakshi
Sakshi News home page

మహాలక్ష్మీ కటాక్షం

Jul 23 2025 7:13 AM | Updated on Jul 23 2025 7:13 AM

మహాలక

మహాలక్ష్మీ కటాక్షం

● అతివలకు కలిసొస్తున్న ఉచిత ప్రయాణం ● ఖమ్మం రీజియన్‌లో 7.38 కోట్ల ఉచిత ప్రయాణాలు ● తద్వారా రూ.331.05 కోట్ల చార్జీలు ఆదా ● నేడు సంబురాలకు ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ

ఇప్పటివరకు రీజియన్‌లో మహాలక్ష్మి

ప్రయాణికుల వివరాలు, ఆదా అయిన నగదు

డిపో ప్రయాణించిన ఆదా అయిన

మహిళలు చార్జీలు (రూ.కోట్లలో)

ఖమ్మం 1,68,28,069 81.42

మధిర 67,76,202 48.69

సత్తుపల్లి 1,73,32,735 61.43

భద్రాచలం 82,99,912 41.14

కొత్తగూడెం 1,06,83,004 40.62

మణుగూరు 1,12,33,835 48.09

ఇల్లెందు 26,60,649 9.66

మొత్తం 7,38,14,406 331.05

ఖమ్మంమయూరిసెంటర్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. 2023 డిసెంబర్‌ 9న ఈ పథకం అందుబాటులోకి రాగా ఇప్పటివరకు ఖమ్మం రీజియన్‌లో 7,38,14,406 మంది ఉచితంగా ప్రయాణించారని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయిన నేపథ్యాన బుధవారం సంబురాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఖమ్మం రీజియన్‌ వ్యాప్తంగా వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఖమ్మం కొత్త బస్టాండ్‌లో జరిగే ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారని అధికారులు తెలిపారు.

‘చిరు’ జీవితాల్లో వెలుగులు..

మహాలక్ష్మి ద్వారా కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం పేద మహిళలకు అండగా నిలుస్తోంది. ప్రయాణ ఖర్చులు లేకపోవడంతో ఆ వనరులను కుటుంబీకుల విద్య, ఆరోగ్యం, చిరు వ్యాపారాలకు మళ్లించగలుగుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగాలకు సిద్ధమవుతూ పట్టణాలకు వెళ్లి వచ్చే యువతులపై ఆర్థిక భారం తగ్గినట్లయింది. అలాగే, గ్రామీణ మహిళలు మెరుగైన వైద్యసేవల కోసం ఆస్పత్రులకు ఉచితంగా వెళ్లివస్తున్నారు. కూరగాయలు, పూలు, ఇతర చిరువ్యాపారాలు చేసే వారికి సైతం ఈ పథకం ఉపయోగపడుతోంది.

మహాలక్ష్మీ కటాక్షం1
1/2

మహాలక్ష్మీ కటాక్షం

మహాలక్ష్మీ కటాక్షం2
2/2

మహాలక్ష్మీ కటాక్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement