
జిల్లాలో జోరు వాన..
జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల పరిధిలోని లో లెవెల్ చప్టాలు నీట మునిగాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మణుగూరు పట్టణంలో మూడున్నర గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పలు వీధులు నీట మునిగాయి. అశోక్‌నగర్‌లోని ఓ వీధి జలదిగ్బంధం అయింది. టేకులపల్లి మండలంలోని పుణ్యపు వాగు ఉధృత ప్రవాహంతో ఆళ్లపల్లి – టేకులపల్లి – కొత్తగూడెం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
– మణుగూరు టౌన్/టేకులపల్లి

జిల్లాలో జోరు వాన..

జిల్లాలో జోరు వాన..

జిల్లాలో జోరు వాన..