
అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి
కొత్తగూడెంఅర్బన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరమైన మందులను అన్ని వేళల్లో అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భాస్కర్‌నాయక్ సిబ్బందికి సూచించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని చిట్టి రామవరం బస్తీ దవాఖానా, పాత కొత్తగూడెంలోని ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులు అందించాలని అన్నారు. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు రాకేష్, అజయ్, పాయం శ్రీనివాస్, హెచ్‌ఈఓ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్