డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సీజ్‌

May 22 2025 12:20 AM | Updated on May 22 2025 12:20 AM

డయాగ్

డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సీజ్‌

మణుగూరు రూరల్‌: మండల కేంద్రంలోని పలు ప్రైవేట్‌ రక్త పరీక్షా కేంద్రాలను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ చైతన్య, డీఈఎంఓ డాక్టర్‌ ఫయాజ్‌ మోహినుద్దీన్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, రికార్డులను పరిశీ లించారు. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టాన్ని ఉల్లంఘించి నిర్వహిస్తున్న ఎస్‌వీ డయాగస్టిక్‌ సెంటర్‌ను సీజ్‌ చేశారు. హెల్త్‌ ఎడ్యుకేటర్‌ సీహెచ్‌ శ్రీనివాస్‌ లీలా, ఎండీ సాధిక్‌ తదితరులు పాల్గొన్నారు

‘సీతారామ’ భూసేకరణకు గ్రామసభలు

అశ్వారావుపేటరూరల్‌: సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్యాకేజీ నంబరు–7, 8వ డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మాణాల కోసం గ్రామసభలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ తహసీల్దార్‌ రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన అశ్వారావుపేట మండలంలోని అచ్యుతాపురం, నారంవారిగూడెం,అశ్వారావుపేట, జమ్మిగూడెం, మద్దికొండ, 23న ఆసుపాక, వేదాంతపురం, తిరుమలకుంట, గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం, గ్రామ పంచాయతీ కార్యాలయం, 24న రామన్నగూడెం, అనంతారం, కన్నాయిగూడెం, నారాయణపురం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభలను నిర్వహిస్తామని తెలిపారు. సభల్లో మొత్తం 848.28 ఎకరాల భూసేకరణకు సంబంధించి ఆయా రైతులతోపాటు, పీసా గ్రామసభలకు కార్యదర్శులు, పీసా కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులు, గ్రామపెద్దలు హాజరు కావాలని కోరారు.

మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానా

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం జిల్లా కోర్టులో పది మందికి జరిమానా విధిస్తూ స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ మెండు రాజ మల్లు బుధవారం తీర్పుచెప్పారు. కొత్తగూడెం వన్‌ టౌన్‌ పరిధి, లక్ష్మీదేవిపల్లి ఏరియా, పాల్వంచ ఏరియాలలో పోలీసులు తనిఖీలు చేపట్టి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పది మందిని పట్టుకుని కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి వారికి జరిమానా విధించారు.

టీజీఆర్‌జేసీలో చాణక్యకు స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

చుంచుపల్లి/సింగరేణి(కొత్తగూడెం): రాష్ట్రంలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించిన టీజీఆర్‌జేసీ పరీక్షలో రుద్రంపూర్‌ సెయింట్‌ జోసెఫ్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి బొమ్మిశెట్టి చాణక్య అభినవ ఎంఈసీలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. పాఠశాల ప్రిన్సిపాల్‌ బ్రదర్‌ రాజశేఖర్‌ రెడ్డి బుధవారం వివరాలు వెల్లడించారు. కాగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ర్యాంకు సాధించినట్టు విద్యార్థి చాణక్య తెలిపాడు.

పీవీకే–5 గనిలో గ్యాస్‌ లీక్‌

గోడలు నిర్మించటంతో తప్పిన ప్రమాదం

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్‌లైన్‌ గనిలో మంగళవారం 16 రేస్‌ 72 లెవల్‌ వద్ద గ్యాస్‌ విడుదలగా, విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. గనిలో గ్యాస్‌ను గుర్తించే మానిటరింగ్‌ సిబ్బంది ఈ విషయాన్ని గమనించి గని మేనేజర్‌ ప్రసాద్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమై రెండు రోజులుగా గ్యాస్‌లీకేజీ అవుతున్న ఏరియాలో గోడలు నిర్మించి గ్యాస్‌ లీకేజీని అరికట్టారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ విషయమై గని మేనేజర్‌ను వివరణ కోరగా.. పాత గని కావడంతో జియాలజికల్‌ సమస్యలు తలెత్తాయని, భయపడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు.

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి

పాల్వంచరూరల్‌: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. వర్తక సంఘం భవనంలో బుధవారం జరిగిన సమావేశంలో గాంధీనగర్‌, శ్రీనగర్‌ ఏరియాల నుంచి కేతిని కుమారి, ఎర్రంశెట్టి రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు పార్టీ లో చేరాయి. ఈ సందర్భగా ఆయన మాట్లాడు తూ బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలోనాయకులు రాపాకరమేష్‌, కళ్లెంవిజయరెడ్డి,భూక్య రవి, వెంకటేశ్వరరావు, రంజిత్‌కుమార్‌, నాగరాజు పాల్గొన్నారు.

డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సీజ్‌1
1/1

డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement