వ్యవసాయ కళాశాలను సందర్శించిన డీలర్ల బృందం
అశ్వారావుపేటరూరల్: శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలను శనివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన దేశి డీలర్ల బృదంసందర్శించింది. ఎరువులు, పురుగు మందులషాపుల యజమానులకు 45 రోజుల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్‌పుట్(దేశి) కోర్సు నిర్వహిస్తున్నారు. శిక్షణలో డీలర్లు కళాశాలను సందర్శించారు. కళాశాలలోని వివిధ రకాల కూరగాయల పంటలతోపాటు మునగ, మామిడి, కొబ్బరి, ఆయిల్‌పామ్ పంటల యాజమాన్యం, సాగు పద్ధతులు, వర్మీ కంపోస్టు, తేనెటీగల పెంపకంపై శాస్త్రవేత్తలు వారికి వివరించారు. కళాశాలలో నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మోడల్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ నీలిమ, డాక్టర్ ఎన్.చరిత, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


