ఆర్టీసీ బస్సులో ఘర్షణ
అశ్వాపురం: ఆర్టీసీ మణుగూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సులో ఇద్దరు మహిళలు ఘర్షణ పడిన పంచాయతీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సులో ఇద్దరు మహిళలకు సీటు విషయంలో గొడవ జరిగింది. ఒకరు ఆపిన సీటులో మరొకరు కూర్చోవటంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొని ఘర్షణకు దారితీసింది. తోటి ప్రయాణికులు వారించిన గొడవ సద్దుమణగకపోవడంతో బస్సును అశ్వాపురం పోలీస్‌స్టేషన్ వద్ద ఆపి, విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సీఐ అశోక్‌రెడ్డి ఇద్దరు మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి, వేర్వేరు బస్సుల్లో పంపించేశారు.
ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా
అశ్వారావుపేటరూరల్: ధాన్యం లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి ధాన్యం బస్తాల లోడుతో విశాఖపట్నానికి వెళ్తున్న లారీ అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం కాలనీ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కీనర్ సురక్షితంగా బయటపడగా, లారీ ముందు భాగం ధ్వంసమైంది.
పేకాటరాయుళ్లు అరెస్ట్
అశ్వాపురం: మండల పరిధిలోని కుమ్మరిగూడెంలో మిషన్ భగీరథ పంప్‌హౌస్ వద్ద పేకాటస్థావరంపై గురువారం పోలీసులు దాడి చేశారు. 10 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. రూ.20 వేల నగదు, 9 సెల్‌ఫోన్లు స్వాఽధీనం చేసుకున్నారు. నిందితుల్లో కొత్తగూడెం హెడ్ క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తున్న మండలానికి చెందిన కానిస్టేబుల్ పాయం సత్యనారాయణ కూడా ఉన్నాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.
దాడి ఘటనలో నలుగురి అరెస్ట్
పాల్వంచ: బైక్‌పై వెళ్తున్న వ్యక్తులను బెదిరించి, దాడి చేసి డబ్బులు లాక్కున్న వ్యక్తులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ సతీష్ కుమార్ కథనం ప్రకారం.. ఈ నెల 12వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో పాల్వంచకు చెందిన తిరుమల రాజు, అతని బావ మంగయ్య కలిసి బైక్‌పై శేఖరం బంజర వెళుతున్నారు. ఈక్రమంలో ముగ్గురు వ్యక్తులు ఊరి చివర రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న రోడ్డుపై ఆటోను అడ్డంగా పెట్టారు. బైక్ నిలపడంతో రాజు, మంగయ్యలను కొట్టి సెల్ ఫోన్, రూ.5 వేల నగదు బలవంతంగా లాక్కుని పారిపోయారు. కాగా ఆటో వెనుక సోగ్గాడు అని రాసి ఉండటాన్ని గమనించిన బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శేఖరం బంజరకు చెందిన బానోతు కిషోర్, బానోతు కుమార్, భూక్యా పవన్‌లను అరెస్ట్ చేశారు. సమావేశంలో సీఐ సతీష్, ఎస్‌ఐ సుమన్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సులో ఘర్షణ
ఆర్టీసీ బస్సులో ఘర్షణ


