ఆయిల్‌పామ్ సాగుతో ఆదాయం
దమ్మపేట : స్థిర ఆదాయం ఆయిల్‌పామ్ పంటతోనే సాధ్యమని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి జే కిషోర్ అన్నారు. గురువారం మండలంలోని శ్రీరాంపురం గ్రామంలో మహిళా రైతులు దొడ్డా శిరీష, దొడ్డా అన్నపూర్ణల వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్ మొక్కలు నాటే కార్యక్రమంలో డీహెచ్‌ఎస్‌ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట సాగుకు ప్రభుత్వం మొదటి నాలుగు సంవత్సరాలపాటు రాయితీ, సబ్సిడీ కల్పిస్తోందని తెలిపారు. తోటలో మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలు సాగు చేసుకోవచ్చని, నాలుగో సంవత్సరం నుంచి 35 సంవత్సరాల వరకు పామాయిల్‌పై ఆదాయం పొందవచ్చని అన్నారు. అనంతరం కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో అశ్వారావుపేట పామాయిల్ నర్సరీ ఇన్‌చార్జి రాధాకృష్ణ, ఆయిల్ ఫెడ్ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.


