అయన్నపాలెంలో భూ వివాదం
చండ్రుగొండ: మండలంలోని అయన్నపాలెం గ్రామంలో భూ వివాదం నెలకొంది. ప్రభుత్వ భూమిలో ఇటీవల నిర్మించిన రేకులషెడ్డును తొలగించేందుకు అధికారులు బుధవారం ప్రయత్నించగా బాధిత కుటుంబాలు అడ్డుకున్నాయి. అయన్నపాలెం గ్రామశివారులో ఎకరన్నర భూమి అదే గ్రామానికి చెందిన బొప్పి నాగరాజు, బొప్పి కాసులు ఆధీనంలో ఉంది. ఆ భూమిలో కొన్నేళ్లుగా ఇటుకబట్టీలు ఏర్పాటు చేశారు. పాత రేకులషెడ్లతోపాటు కొత్తగా మరో రేకులషెడ్డు వేశారు.ప్రభుత్వ కళాశాల నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా తహసీల్దార్ సంధ్యారాణిసదరు భూమి ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. తాజాగా పోలీసులతోపాటు రెవెన్యూ సిబ్బంది రేకులషెడ్డు తొలగించేందుకు ప్రయత్నింగా దళిత కుటుంబాలు అడ్డుకున్నాయి. తాతముత్తాల నుంచి ఆ భూమి ఆధారంగా జీవనం సాగిస్తున్నామని ప్రాధేయపడటంతో తహసీల్దార్ సంధ్యారాణితోపాటు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెనుదిరిగారు.
షెడ్డు నిర్మాణాన్ని తొలగించేందుకు అధికారుల ప్రయత్నం


