బూర్గంపాడు: సారపాకలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో శుక్రవారం గలాట చోటుచేసుకుంది. కార్మిక కుటుంబాలకు వైద్యసేవలు అందించాల్సిన ఈఎస్‌ఐలో కనీసం మందుబిల్లులు కూడా లేవని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీపీ, షుగర్, రాయిడ్ వంటి రోగాలకు కూడా మందులు ఇవ్వకపోవటం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. మందులు ఎందుకు ఇవ్వటం లేదని జిల్లా దళిత హక్కుల పోరాటసమితి అధ్యక్షుడు పేరాల శ్రీనివాసరావు ప్రశ్నించగా ఈఎస్‌ఐ వైద్యుడు కరుణాకర్ దురుసుగా సమాధానం చెప్పటంతో గలాట మొదలైంది. మందులు కావాలంటే మీ ఎమ్మెల్యేకో, సెక్రెటరీయేట్‌కు కంప్లయింట్ చేసుకోండని డాక్టర్ దురుసుగా వ్యవహరించారని శ్రీనివాస్ ఆరోపించారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు ఈఎస్‌ఐకి చేరుకుని వైద్యుని తీరుపై ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. కాగా వైద్యుడు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని పేరాల శ్రీనివాస్ బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.