కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారంతో ముగియగా, ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారంతో పరిసమాప్తమయ్యాయి. చివరిరోజు ద్వితీయ సంవత్సర ప రీక్షలకు జనరల్, ఒకేషనల్ కలిపి 8,115 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 7,915 మంది మాత్రమే పరీక్ష రాశారని, 200 మంది గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.
మెడికల్ బోర్డుకు 170 మంది హాజరు
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని సింగరేణి ప్రధానాస్పత్రిలో గురువారం నిర్వహించిన కార్పొరేట్ మెడికల్ బోర్డుకు 170 మంది కార్మికులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఆస్పత్రిలో గురు, శుక్రవారాల్లో మెడికల్ బోర్డు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలిరోజు 199 మందికి గాను 29 మంది గైర్హాజరయ్యారు. హాజరైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు.. రిపోర్ట్ ఆధారంగా శుక్రవారం అన్‌ఫిట్ చేస్తారు.
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అర్చన, నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.