పినపాక: ఇటీవల వెంకటరావుపేట గ్రామంలో కల్లంలో మిర్చిని తగలబెట్టిన నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ.బయ్యారం పోలీసుల కథనం ప్రకారం..అదే గ్రామానికి చెందిన తాండ్ర బాలకృష్ణ, అతని బంధువు పంచర్ల వెంకటేశ్వర్లు కలిసి పురుషోత్తం అనే రైతుకు చెందిన మిర్చిపై ఈ నెల 10న అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించారు. పురుషోత్తం చేతబడి చేయడంతోతోనే తన భార్య చనిపోయిందని బాలకృష్ణ కక్ష పెంచుకుని ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో వెల్లడయింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు.