
ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్న పోలీసులు
ఇల్లెందు: ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఎస్పీ ఎస్‌వీ రమణమూర్తి అన్నారు. మంగళవారం ఇల్లెందులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించగా.. డీఎస్పీ మాట్లాడారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. మద్యం, నగదు, ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే తమ దృష్టికి తీసుకురావాలని, ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కవాతులో సీఐ కరుణాకర్, ఎస్‌ఐ రవూఫ్, అప్పారావు పాల్గొన్నారు.
టేకులపల్లిలో..
టేకులపల్లి: ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి కోరారు. మంగళవారం రాత్రి టేకులపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు కవాతు నిర్వహించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడారు.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని సూచించారు. రాత్రి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐలు ఇంద్రసేనారెడ్డి, కరుణాకర్, ఎస్‌ఐలు రమణారెడ్డి, గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు.