అశ్వారావుపేటరూరల్: అనుమతులు లేకుండా మూగజీవాలను తరలిస్తున్న కంటైనర్‌ను గురువారం పోలీసులు పట్టుకున్నారు. కాగా పట్టుబడిన కంటైనర్ వాహనంలో ఐదు పశువులు మృత్యువాత పడగా, మరో 15 మూగజీవాల పరిస్థితి విషమంగా ఉంది. ఒడిశా నుంచి హైదరాబాద్‌లోని కబేళాకు అక్రమంగా 83 పశువులను తరలిస్తుండగా అశ్వారావుపేట సమీపంలో ఎస్సై శ్రీకాంత్ వాహనాల తనిఖీల్లో గుర్తించి పట్టుకున్నారు. కంటైనర్ వాహనంలో మూగజీవాలను కిక్కిరిసేలా ఎక్కించడంతోపాటు, అవి కనీసం కదలకుండా కాళ్లను తాళ్లతో కట్టేశారు. దీంతో ఐదు మూగజీవాలు మృతి చెందాయి. హైదరాబాద్‌కు చెందిన నిందితుడు షాజిద్ అహ్మద్‌ఖాన్‌పై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుకున్న మూగజీవాలను పాల్వంచలోని గోసంరక్షణ కేంద్రానికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
ఐదు పశువులు మృత్యువాత