బాధ్యతగా సమస్యలకు పరిష్కారం చూపండి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతగా సమస్యలకు పరిష్కారం చూపండి

Oct 6 2026 2:12 AM | Updated on Oct 6 2026 2:12 AM

బాధ్యతగా సమస్యలకు పరిష్కారం చూపండి నేడు కోటప్పకొండలో సహస్ర ఘటాభిషేకం

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా నలుమూలల నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం 145 అర్జీలు అందినట్లు చెప్పారు. ప్రజలు అందజేసే అర్జీలను వారి సమస్యలను నిశితంగా ఆలకిస్తూ, వారి సమస్యలకు పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆ అర్జీలను అందజేసి పరిష్కార మార్గం చూపాలన్నారు. అధికారులు అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అదేవిధంగా జిల్లాలో ఈ ఫైలింగ్‌ నిర్వహించని అధికారుల వివరాలను నివేదికల ద్వారా ఆయన పరిశీలించారు. గడిచిన వారంలో పీజీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంలో అత్యుత్తమ సేవ కనబరిచిన జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ పి.పద్మావతిని జిల్లా కలెక్టర్‌, జేసీలు శాలువా మరియు జ్ఞాపికతో సత్కరించారు. జిల్లా జేసీ భావన వశిష్ట, ఇన్‌చార్జ్‌ డీఆర్‌ఓ లవన్న, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నరసరావుపేట రూరల్‌: రాష్ట్రమంతా వర్షాలు కురిసి సుభిక్షంగా ఉండాలని కోరుతూ మంగళవారం ఉదయం ఆరు గంటలకు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖర్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలిపారు. దేవాదాయ ధర్మదాయ శాఖ కమీషనర్‌ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి సేవలో పాత్రులు కావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement