సమస్యలు పరిష్కరించకుంటే విధుల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకుంటే విధుల బహిష్కరణ

Oct 6 2026 2:12 AM | Updated on Oct 6 2026 2:12 AM

బాపట్లటౌన్‌: ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం.. కాదంటే విధుల బహిష్కరణ తప్పదని ఆరోగ్యశాఖ జేఏసీ సభ్యుడు కూరపాటి సత్యంరాజు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సత్యంరాజు మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల పూర్తిస్థాయి ఆందోళన కార్యాచరణ సోమవారం నుంచి మొదలయిందన్నారు. ఇందులో భాగంగా జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల నుంచి స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్లు, రేడియోగ్రాఫర్లు, బయో మెడికల్‌ ఇంజినీర్లు పాల్గొని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశామన్నారు. మంగళవారం జిల్లాలోని అన్ని వైద్యశాలల్లో కేవలం ఎమర్జెన్సీ డ్యూటీలు మినహా జిల్లాలోని ఉద్యోగులందరూ విధులు బహిష్కరిస్తారన్నారు. బుధవారం నుంచి అత్యవసర సేవలతో సహా నూరు శాతం కాంట్రాక్టు ఉద్యోగులందరూ విధులు పూర్తిగా బహిష్కరించి ఆందోళన బాటలో పయనిస్తామన్నారు. ఆరోగ్యశాఖ జేఏసీ నాయకులు, కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఆరోగ్యశాఖ జేఏసీ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement