కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక

Oct 5 2026 1:09 AM | Updated on Oct 5 2026 1:09 AM

కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక

బాపట్లటౌన్‌: క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని జిల్లా క్రీడాకారుల సంఘం అధ్యక్షుడు నక్కల అర్జునరావు తెలిపారు. పట్టణంలోని మున్సిపల్‌ హైస్కూల్‌లో ఆదివారం 36వ సబ్‌జూనియర్‌ బాలబాలికల కబడ్డీ జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించారు. గడిచిన వారం రోజులుగా బాలికల విభాగంలో క్రీడాకారులను ఎంపిక చేసేందుకు చినమూరులోని సైనిక్‌ పాఠశాలలో, బాలుర విభాగం క్రీడాకారుల ఎంపిక చినగంజాంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో జరిగాయి. ఉత్తమ క్రీడాకారుల ఎంపికను మున్సిపల్‌ హైస్కూల్‌లో నిర్వహించారు. జిల్లా టీంకు ఎంపిక చేసిన క్రీడాకారులు నవంబర్‌ 11 నుంచి 13 వరకు పశ్చిమగోదావరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. క్రీడాకారుల ఎంపికలో బాపట్ల జిల్లా సెక్రెటరీ మంతెన సుబ్బరాజు, వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రసాదరావు, ట్రెజరర్‌ రాధాకృష్ణ, మున్సిపల్‌ హై స్కూల్‌ పీడీ కత్తి శ్రీనివాసరావు, పీడీ కుటుంబరావు, సాంబు ఎంటర్ర్‌పైజెస్‌ అధినేత సాంబశివరావు, పూలనాగులు, జాయింట్‌ సెక్రెటరీ మరక సాయికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement