జిల్లాస్థాయి రెజ్లింగ్‌లో వడ్డేశ్వరం విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జిల్లాస్థాయి రెజ్లింగ్‌లో వడ్డేశ్వరం విద్యార్థుల ప్రతిభ

Oct 5 2026 1:09 AM | Updated on Oct 5 2026 1:09 AM

జిల్లాస్థాయి రెజ్లింగ్‌లో వడ్డేశ్వరం విద్యార్థుల ప్రతిభ

తాడేపల్లిరూరల్‌: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా రెజ్లింగ్‌ సెలక్షన్స్‌ పోటీల్లో తాడేపల్లి రూరల్‌ వడ్డేశ్వరం ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు మూడు స్వర్ణ పతకాలు కై వసం చేసుకున్నారు. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.ఉమాశ్రీ ఆదివారం వివరాలు వెల్లడించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా కారంపూడిలో రెజ్లింగ్‌ సెలక్షన్స్‌ జిల్లా పరిషత్‌ ఉన్న పాఠశాల జరిగాయని తెలిపారు. తమ పాఠశాలలో 8వ తరగతి చదువతున్న తులసిభాయ్‌ అండర్‌–14 బాలికల విభాగంలో 42 కిలోల కేటగిరిలో, అండర్‌–17 విభాగంలో 48 కిలోల కేటగిరిలో 9వ తరగతి చదువుతున్న భువనేశ్వరి, అండర్‌ 17 విభాగంలో 52 కిలోల కేటగిరిలో 10వ తరగతి విద్యార్ధిని ప్రియదుర్గ గోల్డ్‌ మెడల్స్‌ సాధించారని తెలిపారు. వీరందరూ ఈనెల 10వ తేదీన కారంపూడిలో జరిగే రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్లు ఎం.రవి, నూతక్కి రవిలను, క్రీడాకారులను పాఠశాల సిబ్బంది, విద్యాకమిటీ చైర్మన్‌, గ్రామస్తులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement