బాపట్ల: అభివృద్ధి కోసం అధికారులంతా వేగంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, డీఎంఎఫ్ నిధుల వినియోగంపై అనుబంధ శాఖల అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. అధికారులు సమయాన్ని వృథా చేయకుండా, నిబద్ధతతో పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. నిజాంపట్నం బొర్రవారిపాలెంలో రూ.30 లక్షలతో నిర్మించిన చెరువు కట్టను, రూ.10 లక్షలతో పాఠశాలలో ఏర్పాటు చేసిన తాగునీటి పథకాన్ని ప్రారంభించాలన్నారు. నగరం మండలం దిండి, అలపర్రు గ్రామంలో రూ.28 లక్షలతో నిర్మించిన సీపీడబ్ల్యూఎస్ పథకాన్ని ప్రారంభించాలని కలెక్టర్ చెప్పారు. ఏలేటిపాలెంలో సీపీడబ్ల్యూఎస్ పథకం కింద రూ.19 లక్షలతో చేపట్టిన నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. రేపల్లె తుమ్మల గ్రామంలో సీపీడబ్ల్యూఎస్ పథకం కింద రూ.24 లక్షలతో చేపట్టిన పనులు పూర్తికాగా, ఇంకొల్లు మండలం ఇంకొల్లు గ్రామంలో రూ.21 లక్షలతో పీడబ్ల్యూసీ, మరో రూ.8 లక్షలతో పీడబ్ల్యూసీ స్కీం కింద చేపట్టిన పనులు పూర్తయ్యాయన్నారు.
పర్చూరులో పూర్తయిన డబ్ల్యూసీ స్కీమ్ నాలుగు పనులను త్వరగా ప్రారంభించాలన్నారు. వేటపాలెం మండలం రామాపురం బీచ్ వద్ద తాగునీటి పథకం నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేసినా ఇంతవరకు పూర్తి చేయకపోవడం, పనులు నిలిచిపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సదరు ఏఈకి షోకాజ్ నోటీస్ ఇవ్వాలన్నారు. అక్కయ్యపాలెం బీచ్ వద్ద రూ.30 లక్షలతో చేపట్టిన డ్రెస్ చేంజింగ్ రూమ్ పూర్తి కాకపోవడంపై, రూ.10 లక్షలతో షవర్, బాత్‌రూమ్ పనులు పూర్తి చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మైన్స్ ఏడీ శ్రీనివాసరావు, పీఆర్ ఎస్‌ఈ సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అనంతరాజు, సీపీఓ షాలేము రాజు, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, ఇంజినీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
24న జాబ్‌మేళా వినియోగించుకోవాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన చీరాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించిన గోడపత్రాలను బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో విడుదల చేశారు. చీరాల వైఏ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించే జాబ్‌మేళాలో 20 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. వివరాలకు 79814 43777, 85559 01198, 90522 02833 ఫోను నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ షాలేము రాజు, జిల్లా నైపుణ్యాల అభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ మాధవి, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్


