చుండూరు(వేమూరు): చుండూరు గురుకుల పాఠశాలకు చెందిన క్రీడాకారులు ఫ్లాగ్ ఫుట్‌బాల్‌లో రాష్ట్రస్థాయిలో మూడోస్థానం సాధించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ ఇందిర ప్రయదర్శిని బుధవారం తెలిపారు. ఈ నెల 12,13, తేదీల్లో పిఠాపురం మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన రాష్ట్రస్థాయి ఫ్లాగ్ ఫుట్‌బాల్ పోటీల్లో గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు మూడోస్థానం సాధించడం జరిగిందని ఆమె తెలిపారు. పాఠశాలకు చెందిన జి.వెంకట మోహన్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన సబ్ జూనియర్ క్రీడల్లో పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆమె చెప్పారు. వైస్ ప్రిన్సిపాల్ బాబురావు, పీడీ, ఆర్.ఆదిశేషు, వ్యాయామ ఉపాధ్యాయుడు హరిబాబు పాల్గొన్నారు.
తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ
అమృతలూరు(వేమూరు): తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన అమృతలూరు మండలంలోని మూల్పూరులో బుధవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మూల్పూరు గ్రామానికి చెందిన మండూరు సాంబశివరావు కుటుంబంతో సహా గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉంటున్నాడు. సాంబశివరావు రెండు, మూడు రోజులకు ఒక సారి వచ్చి గ్రామంలోని తన ఇల్లు, పొలాలు చూసుకుని వెళుతుంటాడు. ఈక్రమంలో ఈ నెల 13వ తేదీన గ్రామానికి రాగా.. తన ఇంటి తాళం పగలగొట్టి ఉండడం, తలుపులు తెరిచి ఉండటం చూసి, లోపలికి వెళ్లగా.. బీరువా పగలు కొట్టి దుండగులు రూ. లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు మాయం చేసినట్లు గుర్తించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రేపల్లె కెనాల్‌లో
గుర్తుతెలియని మృతదేహం
కొల్లిపర: కొల్లిపర మండలం పిడ పర్తి పాలెం గ్రామం వద్ద రేపల్లె కెనాల్లో(కాల్వలో) గుర్తుతెలియని వ్యక్తి సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు వయసు కలిగిన మృతదేహం ఉందని పిడపర్తి పాలెం వీఆర్‌వో బుధవారం ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రసాద్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్‌ఐ మాట్లాడుతూ కాల్వలో దొరికిన మృత దేహం గుర్తుపట్టలేనట్టు ఉన్ననట్లు, అతని ఎడమ చేతి మీద హిందీలో పచ్చబొట్టు ఉండటం, మెడలో రుద్రాక్షమాల, ఒంటిపై నలుపు రంగు నిక్కరు, డిక్సీ స్కాట్ బ్రాండ్ ఇన్నర్‌వేర్ ధరించి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. గుర్తించినవారు కొల్లిపర పోలీస్ స్టేషన్‌కు 9440900863 నెంబరులో సమాచారం ఇవ్వాలని కోరారు.
అమరావతిలో ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేయాలి
మంగళగిరి టౌన్: రాజధాని అమరావతిలో పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 25 అడుగుల భారీ విగ్రహంతో పాటు ఘంటసాల కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర చైతన్య వేదిక, ఘంటసాల చైతన్యవేదిక అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళగిరి పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. నవ్యాంధ్ర చైతన్య వేదిక 17వ జాతీయ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతిని భావితరాలకు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఆదిలీలా ఫౌండేషన్ న్యూఢిల్లీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆదినారాయణ, వేదిక గౌరవ అధ్యక్షులు చిట్టిబాబు, కార్యదర్శి ఆంజనేయ రాజు, సహాయ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
తాడికొండ: రాజధాని అమరావతి ప్రముఖ ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రికి ఈ నెల 23న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రికి శంకుస్థాపన నేపథ్యంలో ఏర్పాట్లను బుధవారం అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ)– మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్షీ పార్థసారథి పరిశీలించారు. ముఖ్యంగా ఈ–3, ఎన్‌న్–14 కూడలి నుంచి వేదిక వద్దకు చేరుకునే మార్గాన్ని ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. సీడ్‌యాక్సెస్ రోడ్డు నుంచి సీఎం కాన్వాయ్ నేరుగా ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి కేటాయించిన స్థలానికి సౌకర్యవంతంగా చేరుకునేలా రోడ్డు మ్యాప్ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజినీరు టి.మోజెస్ కుమార్‌ను ఆదేశించారు. పర్యటనలో ఏడీసీ చీఫ్ ఇంజినీర్లు బి.నరసింహమూర్తి, సీహెచ్ ధనుంజయ పాల్గొన్నారు.


