● ఈనెల 12న వృద్ధురాలి హత్య ఉదంతంలో వీడిన మిస్టరీ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్ధనరావు | - | Sakshi
Sakshi News home page

● ఈనెల 12న వృద్ధురాలి హత్య ఉదంతంలో వీడిన మిస్టరీ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్ధనరావు

Sep 17 2026 1:44 AM | Updated on Sep 17 2026 1:44 AM

● ఈనెల 12న వృద్ధురాలి హత్య ఉదంతంలో వీడిన మిస్టరీ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్ధనరావు

మంగళగిరిలో మహిళా క్రికెట్‌ సందడి

ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు ఉమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌

మంగళగిరి టౌన్‌: మహిళా క్రికెట్‌కు ప్రోత్సాహం కల్పించడంతో పాటు రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు వేదిక కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూఏపీఎల్‌) 2026 సీజన్‌–1కు మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వేదిక కానుంది. ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు ఏసీఏ మంగళగిరి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో మొత్తం 13 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్‌ ప్రారంభోత్సవానికి నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 19వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రాయలసీమ జెన్‌స్టార్స్‌, గోదావరి గోల్డెన్‌ ఈగల్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. మంగళగిరి క్రికెట్‌ స్టేడియంలో మహిళా క్రికెట్‌ లీగ్‌ నిర్వహించడంతో నగరానికి మరోసారి క్రీడావేదికగా గుర్తింపు లభించనుంది.

కన్న కూతురే హంతకురాలు

పొన్నూరు: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని కూలి పనులతో జీవనం భారమై.. భర్తతో సహా తల్లి పంచన చేరి, డబ్బు, నగల కోసం ఆమెనే హత్య చేసిన కసాయి కూతురి ఉదంతమిది. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్థనరావు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని క్యాబిన్‌ పేటలో ఈ నెల 12వ తేదీన తల్లిని హతమార్చిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. క్యాబిన్‌ పేటలో నివాసం ఉంటున్న మృతురాలు ఈవూరు లక్ష్మీకి కూతురు, కొడుకు ఉన్నారు. కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తన మనవడు జాషువాతో కలిసి జీవనం సాగిస్తున్నారు. కుమారుడు మరణించినప్పుడు వచ్చిన ఇన్య్సూరెన్స్‌ డబ్బులతో లక్ష్మీ బంగారం నగలు చేయించుకున్నారు. ఆమె కూతురు పుష్పలత మొదటి భర్తతో విడిపోయి, రెండో భర్త చనిపోవడంతో, ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పరిచయమైన సఖినేటిపల్లికి చెందిన రాకేష్‌ కుమార్‌ను మూడో పెళ్లి చేసుకొని తిరుపతిలో కూలి పనులు చేసుకుంటూ జీవన సాగిస్తోంది. కూలి పనులతో జీవనం భారంగా మారడంతో ఆర్థిక సహాయం కోసం పొన్నూరులో ఉంటున్న తల్లి లక్ష్మిని వారు ఆశ్రయించారు. అయితే రెండు నెలల పాటు కూతురు, అల్లుడు ఇంట్లోనే ఉంటూ ఏ పని చేయకుండా ఉండడంతో తల్లి వారిద్దరిని తిరుపతికి వెళ్లిపోవాలంటూ మందలించింది. అయితే ఎలాగైనా తల్లి మెడలోని బంగారం, బీరువాలోని డబ్బులు కాజేయాలని కూతురు, అల్లుడు పన్నాగం వేశారు. 12వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయంలో లక్ష్మి నిద్రలో ఉండగా గొంతుకు చున్నీ బిగించి హత్యకు పాల్పడ్డారు. ఆమె మెడలోని బంగారం తాడుతోపాటు బీరువాలోని డబ్బులు అపహరించి పరారయ్యారు. హత్య చేయడాన్ని చూసిన మనవడు జాషువా వివరాలను పోలీసులకు తెలిపాడు. మృతురాలి సోదరుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. ఈ కేసులో నిందితులైన పుష్పలత, రాకేష్‌కుమార్‌ను అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి బంగారం ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు.

కుంభకర్ణ రెస్టారెంట్‌ తాత్కాలిక మూసివేత

మంగళగిరి రూరల్‌: పాడైన ఆహార పదార్థాలు, నిల్వ ఉన్న మాంసం అపరిశుభ్రంగా ఉన్న వంటగది మొదలగు లోపాలు రెస్టారెంట్‌లో బయటపడటంతో మండల పరిధి కాజా గ్రామం టోల్‌ప్లాజా సమీపంలోని కుంభకర్ణ మల్టీ క్యూజియన్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు బుధవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఐపీఎం డైరెక్టర్‌ అరుణ్‌బాబు స్వయంగా తనిఖీ చేసి పాడైన మాంసం, అపరిశుభ్ర వంటగది గుర్తించారు. వంటగది కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆహార భద్రత అధికారులు బి.నరసింహుడు, ఎ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement