సాగుకు చుక్క రాదు.. నిర్వహణకు దిక్కు లేదు... | - | Sakshi
Sakshi News home page

సాగుకు చుక్క రాదు.. నిర్వహణకు దిక్కు లేదు...

Jul 29 2026 1:34 AM | Updated on Jul 29 2026 1:34 AM

ఖరీఫ్‌ సాగుకు నీరందించడంలో చేతులెత్తేసిన నీటి పారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు. పశ్చిమ బ్యాంక్‌ కెనాల్‌ ద్వారా విడుదల చేసిన నీరు తాగు అవసరాలకే అని ప్రకటనలు గుప్పించారు. దోనేపూడి చానల్‌కు నీటిని విడుదల చేశారు. ఈ నీరు కొల్లూరు బాలుర, బాలికోన్నత పాఠశాలల క్రీడా మైదానంలోకి భారీగా చేరడంతో విద్యార్థులకు ఆటలు కరువయ్యాయి. అమరావతి చాంపియన్స్‌ కప్‌ పేరిట 28, 29 తేదీలలో కొల్లూరు క్రీడా మైదానంలో నిర్వహించాల్సిన ఆటల పోటీల నిర్వహణకు సైతం అవకాశం లేకుండా పోయింది. వర్షాలకుతోడు పాఠశాల క్రీడా మైదానంలోకి కాలువ నీరు భారీగా చేరడంతో పోటీల వేదికను అమృతలూరుకు మార్చారు. – కొల్లూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement