జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించే బాధ్యత ఆర్డీవోలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో స్థానిక కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ భూముల సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చెప్పారు. భూమి రికార్డులలో ఇతరులుగా నమోదైన ప్రతి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆ భూమి యజమాని వివరాలు సేకరించి, దస్త్రాలలో పేర్లు నమోదు చేయాలన్నారు. బాపట్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఐదు ఎకరాల భూమి గుర్తించాలన్నారు.


