బాపట్ల: బాపట్ల జిల్లా కోర్టుకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ న్యాయవాది నల్లమోతు సుబ్బారావును జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమాఖ్య సభ్యులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఆయనను సన్మానించారు.ఈ సందర్భంగా నల్లమోతు సుబ్బారావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గౌరవించిన కాకతీయ సేవా సమాఖ్య సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను న్యాయపరంగా సమర్థంగా నిర్వహిస్తూ ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని అన్నారు. ఎన్నో కష్టనష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నానని, న్యాయవాద వృత్తి ఎంతో పవిత్రమైనదని, బాధ్యతాయుతమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాకతీయ సేవా సమాఖ్య సభ్యులు, మహిళలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


