గుంటూరు రూరల్: పలకలూరులోని విజ్ఞాన్ ప్రాంగణంలో మంగళవారం విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మణ్ డాక్టర్ లావు రత్తయ్య 74వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలతో ఆరంభమైన ఈ వేడుకలలో విజ్ఞాన్ హై స్కూల్ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కూర్మనాధం, వైస్ చైర్‌పర్సన్ లావు రుద్రమదేవి, విజ్ఞాన్ పూర్వ విద్యార్థి, విజ్ఞాన్ వైజాగ్ విద్యా సంస్థల సీఈఓ శ్రీకాంత్, ప్రొఫెసర్ ఎల్‌ఎమ్ పట్నాయక్‌లు రత్తయ్యతో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కూర్మనాధం మాట్లాడుతూ ప్రతి ఏటా రత్తయ్య వల్ల అసంఖ్యాకంగా అభివృద్ధి చెందుతున్న విద్యార్థులు అధ్యాపకుల అభినందనలతో రత్తయ్య పూర్ణా యురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులంతా బాగా చదువుకుని ప్రయోజకులవటమే తనకు అసలైన బహుమతి అని తెలిపారు. రాణిరుద్రమ లావు మాట్లాడుతూ విజ్ఞాన్ విద్యాసంస్థలు విద్యను అందించే సంస్థలు మాత్రమే కాదని, విలువలతో కూడిన వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే ఆలయాలని, ఇంతటి మహోన్నత విద్యాలయాలను గత 50 సంవత్సరాలుగా విజయవంతంగా నడుపుతున్న లావు రత్తయ్య సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు విద్యారంగానికి మార్గదర్శకుడిగా కొనసాగాలని ఆకాంక్షించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ తనలాంటి ఎన్నో వేల మందికి రత్తయ్య దైవసమానులన్నారు. ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో రక్త దాన శిబిరంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని పెద్దఎత్తున రక్తదానం చేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్ నిరుల ప్రిన్సిపాల్ డాక్టర్ పాతూరి రాధిక తదితరులు పాల్గొన్నారు.


