జీజీహెచ్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు

Jul 29 2026 1:34 AM | Updated on Jul 29 2026 1:34 AM

జీజీహెచ్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లోని షాపులను మంగళవారం ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఫుడ్‌ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్‌ నరసింహుడు, జిల్లా విజిలెన్‌న్స్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ చదలవాడ హరిబాబు, బీరాల నాగేశ్వరరావులు షాపులు తనిఖీ చేశారు. షాపుల్లో కాల పరిమితి దాటిన శీతల పానియాలు అమ్ముతున్నట్లు సోమవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో మంగళవారం వారు తనిఖీలు నిర్వహించి నాలుగు షాపుల్లో ఏ ఒక్కరికి ఫుడ్‌లైసెన్సు లేదనే విషయాన్ని గుర్తించారు. ప్యాకెట్లపై నిబంధనల ప్రకారం ఉండాల్సిన వివరాలు లేవని, ఫుడ్‌ లైసెన్సు లేకుండా వ్యాపారం చేస్తున్న నాలుగు షాపులకు నోటీసులు జారీ చేశారు. ఒక దుకాణంలో టీ పొడిలో రంగు కలిపినట్లు గుర్తించి నమూనాలు సేకరించి ఆహార ప్రయోగశాలకు పంపించారు. పాల ఉత్పత్తులు, ఇతర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆహార భద్రత ప్రమాణాల చట్ట ప్రకారం ఫుడ్‌లైసెన్సు తీసుకోకుండా వ్యాపారం చేయడం తీవ్రమైన ఉల్లంఘన అని, విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు హరిబాబు తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో కేసు నమోదు చేసి హాజరు పరిస్తే రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement