బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి సంబంధించిన అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ బి. ఉమామహేశ్వర్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అధికంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలకు సంబందించిన అర్జీలే అధికంగా వస్తున్నాయని పోలీసు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్‌నాయక్, పీజీఆర్‌ఎస్ సెల్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.
ఎస్పీ బి.ఉమామహేశ్వర్


