మడ మొక్కల పెంపకంపై అవగాహన పెంచాలి | - | Sakshi
Sakshi News home page

మడ మొక్కల పెంపకంపై అవగాహన పెంచాలి

Jul 27 2026 1:48 AM | Updated on Jul 27 2026 1:48 AM

మడ మొక్కల పెంపకంపై అవగాహన పెంచాలి 28, 29 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన

బాపట్ల: మడ మొక్కల పెంపకంపై తీర ప్రాంత గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఎఫ్‌ఓ ఎస్‌.రవిశంకర్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ మడ మొక్కల దినోత్సవం సందర్భంగా స్థానిక నగర వనంలో తీర ప్రాంత గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. డీఎఫ్‌ఓ మాట్లాడుతూ మడ అడవులను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రాబోయే తరాలకు వీటిని అడవులుగా అందించాలని ముత్తయిపాలెం ఆదర్శనగర్‌ వన సంరక్షణ సమితి(వీఎస్‌ఎస్‌) సభ్యులకు, మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా దత్తత తీసుకోవాలని సూచించారు. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ మన్నెం సురేంద్ర మాట్లాడుతూ వన సంరక్షణ సమితి సభ్యులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మడ అడవుల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిని కాపాడాలని సూచించారు. ప్రొటెక్ట్‌ సంస్థ కార్యదర్శి చవనం చంద్రారెడ్డి, మానవత సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ బి.శరత్‌బోస్‌, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గురజాల శ్రీనివాసరావు, కార్యదర్శి వి.జోష్న, సంస్థ డైరెక్టర్లు వి.హరిబాబు, పుత్తూరు సుభాషిణి శ్రీనివాస్‌, కోలా సుబ్బారావు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోలా పద్మజ, సంఘ సేవకురాలు రజిని, జి.శాంతారామ్‌, విజయకుమార్‌, సెక్షన్‌ ఆఫీసర్లు, బీట్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

నరసరావుపేట ఈస్ట్‌: పల్నాడు జిల్లా పరిధిలోని కస్తూర్భా బాలికా విద్యాలయాలలో ఖాళీగా ఉన్న 21 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 28, 29 తేదీలలో నిర్వహిస్తున్నట్టు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ పి.శ్యామ్‌ప్రసాద్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెదచెరువులోని కేజీబీవీ పాఠశాలలో ఉదయం 9గంటల నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమవుతుందన్నారు. అర్హులైన అభ్యర్థుల వివరాలు వారు నమోదు చేసిన మొబైల్‌ నంబర్ల ద్వారా సమాచారం అందజేస్తారని వివరించారు. ధ్రువపత్రాల పరిశీనలకు హాజరు కాని, ఒరిజినల్‌ పత్రాలు సమర్పించని, అర్హతకు సంబంధించిన ఆధారాలు చూపని అభ్యర్థుల అభ్యర్థిత్వం పరగణించబడదని స్పష్టం చేసారు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, టెట్‌, టీసీ, కుల, ఈడబ్ల్యూస్‌, స్థానికత, ఆధార్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో నిర్ణీత తేదీ, సమయంలో హాజరు కావాలని తెలిపారు.

డీఎఫ్‌ఓ ఎస్‌.రవిశంకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement