న్యూస్‌రీల్
మరో పది రోజుల్లో పునఃప్రారంభం కానున్న పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పంపిణీకి సిద్ధం కాని కిట్లు పాఠ్య పుస్తకాలు మినహా జిల్లాకు పూర్తిస్థాయిలో చేరుకోని సామగ్రి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పాఠశాలలు తెరిచిన రోజే కిట్లు ముందస్తు ప్రణాళిక లేని టీడీపీ సర్కారు తీరుతో విద్యార్థులకు తిప్పలు
నేడు భరోసా కరువు
గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026
వైభవంగా షిరిడి సాయినాథ బ్రహ్మోత్సవాలు
తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1,500, గరిష్ట ధర రూ.2,500, మోడల్ ధర రూ.1,900 వరకు పలికింది.
అచ్చంపేట : పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్ : జిల్లాలో నూతన విద్యాసంవత్సరంలో పాఠశాలలు తెరిచిన రోజున విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన విద్యార్థి మిత్ర కిట్లు సిద్ధం కాలేదు. టీడీపీ సర్కారు ముందు చూపు లేని పనులతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు నిరాశే మిగలనుంది. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం రోజున ఆనందంగా పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఈ కిట్లు అందే పరిస్థితులు కనిపించడం లేదు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో భేష్..
గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 89,157 మంది విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు అంచనా వేశారు. కానీ పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు మరో నెలకుపైగా పట్టే పరిస్థితులు నెలకొన్నాయి. పాఠ్య పుస్తకాలు మినహా జిల్లాకు పూర్తిస్థాయిలో సామగ్రి చేరుకోలేదు. కానీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు, వారి చదువులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. నాణ్యమైన సామగ్రితో కూడిన విద్యాకానుక స్టూడెంట్ కిట్లను వ్యక్తిగత పర్యవేక్షణతో సిద్ధం చేయించారు. ఏటా పాఠశాలలు తెరిచిన మొదటి రోజున ఒక పండుగగా విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారుల సమక్షంలో విద్యార్థులకు ఈ కిట్లు పంపిణీ చేయించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని కల్పించారు. ఈ విధంగా ఐదేళ్లపాటు పాఠశాలలు తెరిచిన మొదటి రోజునే విద్యార్థుల చేతుల్లో కిట్లను ఉంచారు.
నగరంపాలెం: స్థానిక హౌసింగ్ బోర్డుకాలనీ షిరిడి సాయినాథ మందిరంలో 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం సుప్రభాత సేవ, కాకడ హారతి, బాబా వారికి పంచామృతాలతో అభిషేకం, 108 కళాశాలతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకార పూజ, ప్రత్యేక హారతులు నిర్వహించారు. సాయంత్రం వేళ సంధ్యా హారతి అనంతరం శ్రీరామ భక్త వీరాంజనేయ బృందం భజన జరగ్గా, భక్తులను కార్యక్రమం అలరించింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షుడే మామిడి సీతారామయ్య, గౌరవాధ్యక్షుడు మామిడి రామారావు, సభ్యులు పాల్గొన్నారు.
సంక్షోభంలో ఆక్వా రంగం
7
ప్రస్తుత టీడీపీ పాలనలో విద్యార్థులకు ఆ భరోసా కరువైంది. పాఠశాల తెరిచేందుకు మరో 10 రోజుల వ్యవధి సైతం లేని పరిస్థితుల్లో జిల్లాకు పాఠ్య పుస్తకాలు మినహా మిగిలిన సామగ్రి చేరుకోలేదు. విద్యార్థి మిత్ర కిట్‌లో భాగంగా విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన బ్యాగు, రెండేసి జతల చొప్పున యూనిఫాం, బూట్లు, నోటు పుస్తకాలు, సాక్సులు, టై, బెల్టు అరకొరగా వచ్చాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన 15,26,181 పాఠ్యపుస్తకాల్లో ఇప్పటి వరకు 14,64,850 .... అదే విధంగా నోటు పుస్తకాలు 5,32,451 వచ్చాయి. ఇలా అరకొరగా వచ్చిన సామగ్రితో కిట్లు సిద్ధం చేసి, పాఠశాలలు తెరిచిన రోజున విద్యార్థులకు పంపిణీ చేయడం సాధ్యమయ్యే విషయం కాదని తెలుస్తోంది.


