బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Jun 2 2026 3:06 AM | Updated on Jun 2 2026 3:06 AM

మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్‌ శ్రీ 2026 సీబీఐ విచారణ చేపట్టాలి పులిచింతల సమాచారం సాగర్‌ నీటిమట్టం వివరాలు నిమ్మకాయల ధరలు

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్‌ శ్రీ 2026
సీబీఐ విచారణ చేపట్టాలి

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 520.40 అడుగులకు చేరింది. జలాశయం నుంచి కుడికాలువకు 7,033 క్యూసెక్కులు విడుదలవుతోంది.

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.4,200, మోడల్‌ ధర రూ.3,400 వరకు పలికింది.

దగా డీఎస్సీపై సత్వరం సీబీఐ విచారణ చేపట్టాలని మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీ కోసం నోటిఫికేషన్‌ వేస్తే దానిని అడ్డుకునేందుకు టీడీపీ, కూటమి నేతలు ఆందోళన చేశారని గుర్తు చేశారు. కూటమి సర్కారు వచ్చాకా మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను దగా చేశారని కోన రఘుపతి పేర్కొన్నారు. కనీసం నిబంధనలు పాటించని ఈ డీఎస్సీ విధానంపై సీబీఐ విచారణ చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని కోన రఘుపతి డిమాండ్‌ చేశారు.

– కోన రఘుపతి, మాజీ డెప్యూటీ స్పీకర్‌

6

Advertisement
 
Advertisement
Advertisement