జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: ఇంధన పొదుపు అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఉదయం కలెక్టర్ బంగ్లా నుంచి మున్సిపాలిటీ పరిధిలో పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి పాల్గొనేందుకు హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై వెళ్లారు. హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు.
అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవు
ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 44 మంది అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. అర్జీలను పూర్తి స్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో బాపట్ల సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్‌నాయక్, పీజీఆర్‌ఎస్ సెల్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చినగంజాం: మండలంలోని కొత్తపాలెం పంచాయతీ మూలగానివారిపాలెం గ్రామానికి చెందిన అక్కల అజిత్‌రెడ్డి జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. అడ్వాన్స్ పరీక్షలో మొత్తం 221 మార్కులు రాగా పాజిటివ్ మార్కులు 226 సాధించాడు. ఆల్ ఇండియా (ఐఐటీ) 738వ ర్యాంక్ సాధించాడు. అజిత్‌రెడ్డి స్థానిక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నాగరాజురెడ్డి కుమారుడు. పదో తరగతి స్థానిక సత్యం హైస్కూల్లో చదివాడు. అజిత్‌రెడ్డి ర్యాంక్ సాధించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఆలస్యంగా సాగిన పింఛన్ల పంపిణీ
కారంచేడు: నెల ప్రారంభం రోజే పంపిణీ చేయాల్సిన పింఛన్లు సర్వర్లు మొరాయించడంతో లబ్ధిదారులు సోమవారం ఇబ్బందులు పడ్డారు. మండల వ్యాప్తంగా వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆలస్యంగా సాగింది. ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైనప్పటికీ సర్వర్లు మొరాయిండంతో ఒక్కో పింఛన్ పంపిణీకి సుమారు 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టినట్లు సిబ్బంది తెలిపారు.


