అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు

Jun 2 2026 3:06 AM | Updated on Jun 2 2026 3:06 AM

బాపట్ల: పీజీఆర్‌ఎస్‌లో అర్జీదారులు అందజేసే సమస్యల అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ట, డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్‌లతో కలసి అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 132 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో నమోదైన అర్జీలను క్షేత్రస్థాయికి వెళ్లి అర్జీదారులతో మాట్లాడి పరిష్కారం చేయాలన్నారు. మండల స్థాయిలో అత్యధికంగా అర్జీలు పెండింగ్‌లో ఉన్న వాటిని పరిశీలించి పరిష్కారం చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంపై వ్యక్తిగతంగా ప్రజల అభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అర్జీలపై ఆడిట్‌ చేయాలని ఆదేశించారు. జనగణన ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. ఫారం 6,7,8 పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.విజయమ్మ, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్‌ఈ అనంతరాజు, సీపీఓ.ఏ.ఎస్‌.రాజు, డ్వామా, మెప్మా, గృహ నిర్మాణ సంస్థ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల పీడీలు విజయలక్ష్మి, పాల్‌, వెంకటేశ్వరరావు, రాధామాధవి, ఆనంద సత్యపల్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం కరుణశ్రీ, డీసీహెచ్‌ఎస్‌ పద్మావతి, డీటీసీ పరంథామరెడ్డి, జీఎండీఐ సి.రామకృష్ణ, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ రాజన్‌బాబు, జిల్లా వ్యవసాయ అధికారి ఏ.లక్ష్మి, డీఎస్‌ఓ ఆర్‌.జమీర్‌ బాషా, సివిల్‌ సప్లయీస్‌ డీఎం శ్రీలక్ష్మి, డీఎల్‌డీఓ.విజయలక్ష్మి, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్‌ యశ్వంత్‌, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు జయరాములు, రాజాదేబోరా, డీఎఫ్‌ఓ రవిశంకర్‌, డీఈఓ శ్రీనివాస్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement