పచ్చ నేతల సేవలో...! | - | Sakshi
Sakshi News home page

పచ్చ నేతల సేవలో...!

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 4:07 AM

సోమవారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2026 పచ్చ నేతల సేవలో...! ‘మత్స్యకార సేవలో’ మితిమీరిన టీడీపీ నేతల జోక్యం పులిచింతల సమాచారం వైభవంగా జ్యేష్ఠాభిషేకం

న్యూస్‌రీల్‌

వేట అంటే తెలీని పలువురికి అర్హుల జాబితాలో చోటు! నిజమైన మత్స్యకారులకు అన్యాయం ప్రశ్నించిన వారిపై రుసరుసలు కప్పదాటు సమాధానాలు ఇదెక్కడి ‘పచ్చ’పాతం అని ప్రశ్నిస్తున్న మత్స్యకారులు

అన్ని పత్రాలు ఉన్నా డబ్బు జమ కాలేదు

ఆశలు వదులుకున్నాం..

వేట రాని వారి పేర్లు జాబితాలో ఉన్నాయి..

బాపట్ల
సోమవారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2026
‘మత్స్యకార సేవలో’ మితిమీరిన టీడీపీ నేతల జోక్యం

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

వినుకొండ: పట్టణంలోని శ్రీనివాసనగర్‌లోగల అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం 108 కలశాలతో విశేష జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు.

చీరాల అర్బన్‌: సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే భత్యం అర్హులందరికీ దరిచేరలేదు. ఇదిలా ఉంటే సముద్రంలో మత్స్య సంపదను వేటాడటం తెలియని పలువురి పేర్లు అర్హుల జాబితాలో చేరాయి. దీంతో పలువురు అర్హులైన మత్స్యకారులు నష్టపోయారు. కొందరు సారంగులు(బోటు యజమానులు)కు భత్యం సొమ్ము రాలేదు. ఇదేమని అడిగిన వారికి స్థానిక అధికారుల నుంచి రుసరుసలు, కప్పదాటు సమాధానాలు వస్తున్నాయి. ఇదెక్కడి పచ్చపాతమని అర్హులు వాపోతున్నారు. మితిమీరిన పచ్చ రాజకీయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరి కోసం మత్స్యకార సేవ..

ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి జూన్‌ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేటకు విరామం. మత్స్యసంపద పునరుత్పతి జరిగే కాలం. ఆ సమయంలో మత్స్యకారుల జీవన భృతికి ప్రభుత్వ పరంగా సాయం అందిస్తుంది. అర్హులైన ప్రతి మత్స్యకారుడు, సారంగు (బోటు యజమాని)లకు సంధికాలపు భత్యంగా రూ.20వేలు అందించాలి. అందుకు సంబంధించి ఈ నెల 19వ తేదీన మత్స్యకార సేవలో.. పేరుతో ఆ నగదును వారి, వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అయితే అందులో అర్హులైన పలువురు మత్స్యకారులకు ఆ సాయం దరిచేరలేదు.

మితిమీరిన ‘పచ్చ’ పాతం

మత్స్యకార సేవలో పథకానికి అర్హులైన ప్రతి ఒక్క మత్స్యకారుని పేరు జాబితాలో ఉండాలి. అయితే అర్హులైన పలువురి మత్స్యకారుల పేర్లు జాబితాలో లేవు. పలువురు అనర్హుల పేర్లు జాబితాలో చేరాయి. ఇదెక్కడి న్యాయమని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. మితి మీరిన పచ్చ రాజకీయమే అందుకు కారణమనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదని, అర్హులందరికీ భత్యం సొమ్ము అందాలని కోరుతున్నారు.

7

నాకు బోటు ఉంది. బోటు రిజిస్ట్రేషన్‌ కాగితం ఉంది. డీజిల్‌ రాయితీ కాగితం ఉంది. మా పెద్దల నుంచి బోటు ఉంది. ఇప్పుడు భత్యం సొమ్ము నా బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. ఇదేమని అడిగితే పై నుంచి వచ్చిన జాబితాలో నీ పేరు లేదని చెబుతున్నారు. అదేమంటే కోప్పడుతున్నారు. మత్స్యకారులు కాకుండా కొందరు ఇతర కులాల వాళ్లు వేట చేస్తారు. అలాంటి వారి పేర్లు ఉండాలి. తప్పు లేదు. అసలు వేటంటే తెలీనోళ్లు పేర్లు కూడా ఉన్నాయి.

– రాజారావు, సారంగు, వాడరేవు

మా కుటుంబంలో నా పేరు ఒక్కటే పెట్టుకున్నాం. కళాసీగా పని చేస్తుంటా. మేం ఇక్కడ కాగితం పెట్టుకున్నా, తరువాత అవి మారిపోతుంటాయి. అందుకే వాటి మీద ఆశలు వదులుకున్నాం. ఎవరిని అడిగి ప్రయోజనం ఏముంది?

– శివ, మత్స్యకారుడు, వాడరేవు

మామూలుగా కాగితాలు పెట్టుకుని పేర్లు రాసేపుడు బోటు దగ్గర నిలుచోబెట్టి ఫొటోలు తీస్తారు. కొందరు అలా బోటు దగ్గరకు వచ్చి ఫొటోలు తీపించుకో లేదు. కానీ థంబ్‌ వేయటానికి వచ్చినపుడు చూశాం. వారికి సముద్రంలో వేట గురించి ఏ మాత్రం తెలీదు. మరి వారి పేర్లు అర్హుల లిస్టులోకి ఎలా వచ్చాయనేది పెద్ద ప్రశ్న. నాకు డబ్బులు పడ్డాయి. మా బోటు యజమానికి డబ్బు పడలేదు. వేరేవాళ్లకు ఇచ్చుకుంటారో, మానుకుంటారో మాకు అనవసరం. కానీ నిజంగా వేట చేసేవారి పేర్లు లేకపోవటం సరికాదు. దీనిపై మళ్లీ విచారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – రమణ, మత్స్యకారుడు, వాడరేవు

Advertisement
 
Advertisement
Advertisement