పేషెంట్‌ కేర్‌ కోసం ఏదైనా చేస్తా.. | - | Sakshi
Sakshi News home page

పేషెంట్‌ కేర్‌ కోసం ఏదైనా చేస్తా..

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 4:07 AM

పేషెంట్‌ కేర్‌ కోసం ఏదైనా చేస్తా..

జీజీహెచ్‌ నూతన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుందరాచారి

గుంటూరు మెడికల్‌: పేషెంట్‌ కేర్‌ కోసం ఏదైనా చేస్తానని గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అన్నా రు. అవసరమైతే రోగిని వీల్‌చైర్‌లో తానే తీసుకెళ్లి చికిత్స అందిస్తానని చెప్పారు. ఆదివారం డాక్టర్‌ యశస్వి రమణ నుంచి డాక్టర్‌ సుందరాచారి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్‌ సుందరా చారి మీడియాతో మాట్లాడుతూ జీజీహెచ్‌ క్యాజువాల్టీ వైద్యసేవలు మెరుగుపరుస్తామని తెలిపారు. కుటుంబంలో ఎవరికై నా అనారోగ్యం వచ్చి అత్యవసర వైద్యసేవలు కావాలనుకుంటే వారు మొట్టమొదటగా జీజీహెచ్‌ క్యాజువాల్టీకి వెళ్లి వైద్యసేవలు పొందాలనే తరహాలో క్యాజువాల్టీ సేవలు మెరుగుపరుస్తామని వెల్లడించారు. గుంటూరు వైద్య కళాశాలలో చదువుకుని కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ నేడు అదనంగా జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ బాధ్యతలు కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు. వైద్య కళాశాల, ఆస్పత్రిలో 45 సంవత్సరాల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ ఎన్‌.వి. సుందరాచారికి ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌, డెప్యూటీ కలెక్టర్‌ చిన్నం సుధారాణి, అసిస్టెంట్‌ డైరక్టర్‌ పూసల శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటర్‌ బచ్చు ప్రవీణ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌లు జమ్ముల అరుణ్‌, నూతక్కి శ్రీకాంత్‌, వేణు, లంకపల్లి శ్రీనివాస్‌,జీవీ కోటేశ్వరరావు, జూనియర్‌ అసిస్టెంట్స్‌ వాసిరెడ్డి కార్తిక్‌, తిరుపతిరావు, ఆనంద్‌, పలువురు నర్శింగ్‌ సిబ్బంది తదితరులు శాలువా కప్పి, బొకే అందజేసి అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement