భట్టిప్రోలులో గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

భట్టిప్రోలులో గాలివాన బీభత్సం

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

దెబ్బతిన్న పంటలు

భట్టిప్రోలు: ఇప్పటివరకు ఎండలు తీవ్రంగా ఉన్న వాతావరణంలో అనూహ్య మార్పులతో గురువారం రాత్రి సంభవించిన ఆకస్మిక గాలులకు భట్టిప్రోలు మండలంలోని కృష్ణా నది పరివాహక లంక గ్రామాల్లోని వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా వీచిన గాలులకు అరటి తోటలు నేలవాలాయి. పక్వానికి వచ్చిన అరటి గెలలు రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కల్లాల్లో ఆరబోసిన పసుపు పంట తడిసిపోయింది. మొక్కజొన్న కూడా వర్షానికి దెబ్బతింది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన ప్రభావంతో మండలంలోని గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. గురువారం రాత్రి 10:30 నుంచి శుక్రవారం 10:30 గంటల వరకు సరఫరాకు విఘాతం కలిగింది.

Advertisement
 
Advertisement
Advertisement