తెనాలి: సాంఘిక నాటిక పోటీల్లో అద్దేపల్లి– ఆరాధ్యుల ఆర్ట్స్, తెనాలి వారి ‘విజేతలు‘ సాంఘిక నాటిక నాలుగు బహుమతులను గెలుచుకుంది. ఉత్తమ ప్రదర్శనగా జ్యూరీ బహుమతితోపాటు ఉత్తమ బాలనటి (తాడిగిరి ఊహశ్రీ), ఉత్తమ ఆహార్యం(శేషగిరి), ఉత్తమ నటన జ్యూరీ బహుమతి(సాత్విక)ని ఎంపికయ్యారు. పల్నాడు జిల్లా సాతులూరులో ఈనెల 24– 28వ తేదీల్లో ఎన్టీఆర్ కళాపరిషత్ నాటిక పోటీల్లో తెనాలికి చెందిన ప్రముఖ నర్తకి, రచయిత ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్య రచించిన ఈ నాటికను అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి దర్శకత్వంలో ప్రదర్శించారు. పరిషత్ పోటీల్లో తొలి ప్రదర్శనలోనే నాలుగు బహుమతులను గెలుచుకోవటంపై రచయిత ఆరాధ్యుల తేజస్విప్రఖ్య, పట్టణ కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు సత్యనారాయణ శెట్టి, జానీబాషా, పిట్టు వెంటక కోటేశ్వరరావు, దేవిశెట్టి కోటేశ్వరరావు, హార్మోనిస్ట్ యోహాను, పల్లపాటి ఫ్రాన్సిస్, పౌరాణిక నటుడు పరిశుద్ధరావు తదితరులు విజేతలను అభినందించారు.


