బాపట్ల: బాపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుంచి బాపట్ల ప్రీమియం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు అంకమ్మ చౌదరి తెలిపారు. స్థానిక అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాపట్ల ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్లు స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతి రూ.50వేలు, ద్వితీయ బహుమతి రూ.25వేలు అందించడంతోపాటు మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌కి రూ 5వేలు బహుమతి అందిస్తామని తెలిపారు. ప్రతి మ్యాచ్‌లో మేన్ ఆఫ్ ది మ్యాచ్‌కి రూ.1000లతోపాటు మెమోంటో అందిస్తారని తెలిపారు. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నమెంట్‌కి ఆసక్తిగల క్రీడాకారులు తమ పేర్లను 9908950963 నంబర్‌కు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని సూచించారు. టోర్నమెంట్‌కి సహాయ సహకారాలు అందిస్తున్న స్పాన్సర్స్ అందరికీ బాపట్ల క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రోశయ్య, సెక్రటరీ స్టాండ్ విమల్ కుమార్, వైస్ జాయింట్ సెక్రెటరీ నరేష్, ట్రెజరర్ అబ్దుల్ కరీం, క్రీడాభిమానులు మంతెన శ్రీకాంత్ రాజు శ్రీనివాస్ పాల్గొన్నారు.


