న్యూస్‌రీల్
పెట్రోలు, డీజిల్‌పై పన్నులను ప్రక్షాళన చేస్తాం, ధరలు తగ్గిస్తామంటూ ఎన్నివేళ ఊదరగొట్టిన టీడీపీ నేతలు నాడు పెట్రోల్ బంకుల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ నారా లోకేష్ హామీ నేడు దేశంలోనే అత్యధిక పన్ను వసూలు చేస్తోంది చంద్రబాబు సర్కారే పెట్రో ధరల పెంపుతో జిల్లాలో రోజుకు రూ.30లక్షల అ‘ధన’పు భారం
మూడు వేదికల్లో ఐదో సీజన్ నిర్వహణ మంగళగిరిలో ఫైనల్స్
బాపట్ల
శుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026
నాడు ధరలపై వ్యంగ్యం.. నేడు మౌనం
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,300, మోడల్ ధర రూ.3,000 వరకు పలికింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.
చీరాల అర్బన్: పెట్రో భారం పేద మధ్య తరగతి వర్గాల వారిని తీవ్ర ఆందోళనలోకి.. పేదరికంలోకి నెట్టే కాలం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం ఎలా తగ్గించాలా, జనంపై కొంతైన భారం తగ్గించాలని ఆయా రాష్ట్రాలు చూస్తుంటే.. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఇంధనంపై అదనపు పన్నులు వేస్తూ, ప్రజలపై అ‘ధన’పు భారం మోపుతోంది.
ఎన్నికల వేళ సెల్ఫీలు..
ఎన్నికల వేళ నారా లోకేష్ పెట్రోలు బంకుల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై నిందలు మోపాడు. అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఊదరగొట్టాడు. అందుకు చంద్రబాబు తందాన అన్నారు. అయితే గత 20 రోజుల వ్యవధిలో 4 సార్లు ఇంధన ధరలు పెరిగితే మాత్రం ముఖం చాటేశారు. లీటరుకు సుమారు రూ.8 వరకు అదనపు భారం మోపారు. దేశంలోనే పెట్రోలు, డీజిల్ పై అత్యధిక పన్ను వసూలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రాకు గుర్తింపు తెచ్చారు.
జిల్లాలో రోజుకు రూ.30 లక్షల అదనపు భారం
జిల్లాలో సుమారు 130 పెట్రోలు, డీజిల్ బంకు లున్నాయి. వాహనాల సంఖ్య ఆధారంగా రవాణాకు సంబంధించి రోజుకు రు.1.4లక్షల లీటర్ల పెట్రోలు, 2.3లక్షల లీటర్లు డీజిల్ వినియోగం జరుగుతుందని అంచనా. వ్యవసాయం, ఆక్వా సాగు, పర్యాటకం, వస్త్ర వ్యాపారం తదితరాలతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 216, 167ఏ జాతీయ రహదారులపై రాకపోకలు సాగించే వాహనాలతో వినియోగం గణనీయంగా ఉంటుంది. ఈ క్రమంలో సగటును రోజుకు 3.7లక్షల ఇంధన వినియోగం జరిరుగుతుంది. లీటరుపై రూ.8లు పెంపుతో రోజుకు సుమారు రూ.30లక్షల అదనపు భారం పడుతుంది.
ఇంధన ధరల్లో ఏపీనే టాప్..!
దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యాట్‌తో పాటు రూ.1 రోడ్డు డెవలప్‌మెంట్ సెస్ కింద వసూలు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో, అదేవిధంగా కాకినాడకు కూతవేటు దూరంలో ఉన్న యానాంలో కూడా మనకన్నా తక్కువ ధరకే ఇంధనం దొరుకుతుండగా.. ఇక్కడ మాత్రం చంద్రబాబు సర్కార్ అదనపు పన్నులు మోపుతూ.. జనంపై మోయలేని భారం వేస్తోంది.
● భక్తిశ్రద్ధలతో బక్రీద్
త్యాగం, భగవంతునిపై విశ్వాసం, విధేయత, దానం, మానవత్వానికి ప్రతీకగా జరుపుకొనే బ్రకీదు పండుగను జిల్లాలో గురువారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకొన్నారు. ఆయా చోట్ల ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు బక్రీదు సందేశం అందించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. – రేపల్లె
7


