వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల్లో పలువురు నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల్లో పలువురు నియామకం

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల్లో పలువురు నియామకం నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల్లో పలువురిని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా ఇందుకూరి సుబ్బారెడ్డి (గురజాల), యువజన విభాగ జిల్లా ఉపాధ్యక్షులుగా నాలి వెంకటరావు యాదవ్‌ (సత్తెనపల్లి), యువజన విభాగ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అమరేశు అజయ్‌బాబు (నరసరావుపేట) నియమితులయ్యారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం 30న సాగర్‌ జలాలు విడుదల బేస్‌బాల్‌లో రాష్ట్ర జట్టుకు నాల్గవ స్థానం ఎరువుల ధరలు తగ్గించే వరకు ఆందోళన కొల్లూరు: ఎరువుల ధరలు తగ్గించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి మేలు చేకూర్చేవరకు ఆందోళన ఆపబోమని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బొనిగల సుబ్బారావు, అగస్టీన్‌లు హెచ్చరించారు. మండలంలోని అనంతవరంలో పెంచిన కాంప్లెక్స్‌, ఎరువులు, పెట్రో ధరల జీవోలను గురువారం దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు ధరలు పైసల్లో పెంచి ఎరువుల ధరలు మాత్రం రూ.వందల్లో పెంచుకుంటూ పోతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం పొట్టగొడుతున్నాయని విమర్శించారు. వారం రోజుల వ్యవధిలో ఇంధన ధరలు నాలుగు ధపాలుగా పెంచిన ప్రభుత్వం వ్యవసాయ రంగానికి తీరని ద్రోహం చేస్తుందన్నారు. ప్రభుత్వం ఎరువుల కంపెనీలకు కొమ్ముకాస్తూ రైతులను నట్టేట ముంచుతుందన్నారు. డాక్టర్‌ స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయకుండా రైతులను ప్రభుత్వం దగా చేయడం తగదన్నారు. స్వామినాథన్‌ సిఫార్సుల మేరకు పంట పెట్టుబడి ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కౌలు, రైతు సంఘాల నాయకులు గోళ్ల రాంబాబు, మేడికొండ నాగేశ్వరరావు, గద్దె రవి, పాముల వేణు, మేడికొండ రామారావు పాల్గొన్నారు.

సత్తెనపల్లి: పట్టణంలోని రంగా కాలనీ17వ లైన్‌ చివర వ్యవసాయ పొలాల్లో రైల్వే ట్రాక్‌ నుంచి 100 మీటర్ల దూరంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు పట్టణ సీఐ మల్లికార్జునరావు గురువారం తెలిపారు. మృతుడు వయసు సుమారు 25 సంవత్సరాలు ఉంటాయని, వంటిపై డాలర్‌బిగ్‌బాస్‌ కంపెనీ ఫుల్‌ అండర్‌ వేర్‌ ధరించి ఉన్నాడని, కుడి చేతి భుజముపై లవ్‌ సింబల్‌ పచ్చబొట్టు ఉందని తెలిపారు. ఎత్తు 5.5 అడుగులు, చామనఛాయ రంగుతో ఉన్నాడన్నారు. ముక్కు నుంచి రక్తం వచ్చినట్లుగా ఉందని, నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడే ఉండి, మద్యంమత్తులో చనిపోయినట్లుగా అనిపిస్తుందన్నారు. ఆనవాలు గుర్తిస్తే పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

శావల్యాపురం: తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్‌ జలాలు విడుదల చేస్తున్నట్లు లింగగుంట్ల ఎన్నెస్పీ ఈఈ డివి సుబ్బారావు గురువారం తెలిపారు. ఈఈ సుబ్బారావు మాట్లాడుతూ ఈనెల 30న శావల్యాపురం మండలం గంటావారిపాలెం గ్రామ సమీపాన ఉన్న అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌కు 1000 క్యూసెక్కుల సాగర్‌ జలాలు తాగునీరు అవసరాల కోసం విడుదల అవుతాయన్నారు. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని మంచినీరు చెరువులు, వాగులు, కుంటలు నింపుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం మాచర్ల పరిధిలో బొగ్గువాగు నింపుతున్నట్లు తెలిపారు. మండలంలోని తాగునీటి చెరువులను సాగర్‌ చెరువులను ఎన్నెస్పీ, పంచాయతీ కార్యదర్శులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల పర్యవేక్షణలో నూరు శాతం నింపటానికి చర్యలు చేపట్టామన్నారు. సాగర్‌ జలాలు వృథా చేయరాదని, ఇతర అవసరాలకు వినియోగించరాదన్నారు.

రొంపిచర్ల: భువనేశ్వర్‌లో నిర్వహిస్తున్న నేషనల్‌ బాలికల సబ్‌ జూనియర్‌ బేస్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు నాలుగో స్థానం దక్కించుకుందని రొంపిచర్ల జెడ్పీహెచ్‌ఎస్‌ వ్యాయామ ఉపాధ్యాయుడు వై సైదయ్య తెలిపారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో మహారాష్ట్ర–ఆంధ్ర జట్ల మధ్య నిర్వహించిన మ్యాచ్‌లో మొదటి ఐదు ఇన్నింగ్స్‌లో 1–1 స్కోర్‌తో ఆట డ్రా అయింది. అదనంగా ఆడిన ఆరవ ఇన్నింగ్స్‌లో మహారాష్ట్ర జట్టు ఆంధ్రప్రదేశ్‌ జట్టును 2–1 తేడాతో ఓడించి మహారాష్ట్ర జట్టు ఫైనల్‌కు చేరుకుంది. భువనేశ్వర్‌లో జరుగుతున్న నేషనల్‌ బాలికల సబ్‌ జూనియర్‌ బేస్‌బాల్‌ టోర్నమెంట్‌లో దేశం మొత్తం మీద 26 రాష్ట్రాల జట్టు పాల్గొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement