జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: సీఆర్‌జెడ్ నిబంధనలు అనుసరించి బీచ్‌లను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ చెప్పారు. సీఆర్‌జెడ్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. వేసవిలో మత్స్యకారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత్స్యశాఖ రూపొందించిన పోస్టర్‌లను కలెక్టర్ విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సీఆర్‌జెడ్ నిబంధనలు అనుసరించి సముద్ర తీరం వెంబడి 200 నుంచి 500 మీటర్లలోనే రిసార్డ్స్‌లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని స్పష్టం చేశారు. ఆ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె విజయమోహన్, మత్స్య శాఖ డీడీ గాలి దేముడు, వీక్షణ సమావేశం ద్వారా వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సూర్యలంక బీచ్‌లో సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు
సీనియర్ సిటిజన్స్ కోసం సూర్యలంక బీచ్‌లో ప్రత్యేకంగా 20 మీటర్లు సీటింగ్ ఏర్పాటు చేయిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వృద్ధుల సంక్షేమ చట్టంపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఎవరికై నా ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఏర్పడితే తక్షణమే ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాట్సాప్‌లో సమాచారం సెండ్‌చేస్తే తక్షణమే ఎలాంటి సహాయం అయినా వృద్ధులకు అందేలా చూస్తామన్నారు.


