అర్జీలు పునరావృతం కాకూడదు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పునరావృతం కాకూడదు

May 26 2026 3:26 AM | Updated on May 26 2026 3:26 AM

బాపట్ల: పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ట, డీఆర్‌ఓ జి.గంగాధర్‌ గౌడ్‌ తో కలసి కలెక్టర్‌ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అర్జీదారుల సమస్యలకు సంబంధిత శాఖల పరిధిలో అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపగా మరికొన్నిటిని విచారణకు ఆదేశిస్తూ ఆయా శాఖలకు అందజేసి పరిశీలించి పరిష్కరం చూపాలని ఆదేశించారు. అదేవిధంగా జనగణన ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.విజయమ్మ, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్‌ఈ ఆనంతరాజు, సీపీఓ ఏఎస్‌ రాజు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరింత ఆకర్షణీయంగా సూర్యలంక బీచ్‌

సూర్యలంక బీచ్‌ను మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం సూర్యలంక బీచ్‌లో స్వదేశ్‌ దర్శిని 2.0 పథకం ద్వారా జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సూర్యలంక బీచ్‌ను మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నిర్లక్ష్యానికి తావులేకుండా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి టూరిజం అధికారి ఆనంద సత్యపాల్‌, ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement