లక్ష్యాన్ని నెలాఖరుకు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యాన్ని నెలాఖరుకు పూర్తి చేయాలి

May 26 2026 3:26 AM | Updated on May 26 2026 3:26 AM

లక్ష్యాన్ని నెలాఖరుకు పూర్తి చేయాలి మరణించినా జీవించవచ్చు

అదే మానవ జన్మకు సార్ధకత జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రమణ యశస్వి

గుంటూరు మెడికల్‌: హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని మే నెలాఖరుకు పూర్తి చేయాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు అన్నారు. పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌, ఎన్‌సీడీ, హీట్‌ వేవ్స్‌, జాతీయ ఆరోగ్య కార్యక్రమములపై సోమవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు మాట్లాడుతూ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ అన్నపూర్ణ, డాక్టర్‌ సుజాత, డాక్టర్‌ శ్రీధర్‌, డాక్టర్‌ ప్రియాంక, శివ సాంబి రెడ్డి, వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: మనిషి మరణించిన సమాజానికి ఉపయోగపడితే జన్మకు పూర్తి స్థాయిలో సార్ధకత చేకూరుతుందని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, ఆంధ్రప్రదేశ్‌ శరీర అవయవదాతల సంఘ అధ్యక్షుడు డాక్టర్‌ రమణ యశస్వి పేర్కొన్నారు. అఖిల భారత అవయవ శరీర దాతల సంఘ ఆధ్వర్యంలో సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషనల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌(స్పెక్ట్‌) జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని సోమవారం అరండల్‌ పేటలోని ఆర్య సమాజం ప్రాంగణంలో నిర్వహించారు. సమావేశానికి సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు మేడూరి రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షత వహించారు. డాక్టర్‌ రమణ యశస్వి మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన మనదేశంలో మూఢ విశ్వాసాలు, అపోహలు తొలగి రక్త, నేత్ర, అవయవ, దేహ దానం ఒక ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న అఖిలభారత శరీర అవయవదాతల సంఘ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్‌ గూడూరు సీతామహాలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేహ, అవయవదానాలపై సరళీకృత విధానాలు తీసుకురావాలని కోరారు. అఖిలభారత శరీర అవయవదాతల సంఘం, స్పెక్ట్‌ ఆర్గనైజేషన్‌లు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాదిమందిని చైతన్యవంతులను చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా స్పెక్ట్‌ ప్రచార గోడ ప్రతులు ఆవిష్కరించిన అనంతరం ఇటీవల నేత్ర, అవయవ, శరీర దానాలు చేసిన వారి కుటుంబ సభ్యులను అతిథులు సత్కరించారు. కార్యక్రమంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ టి.సేవకుమార్‌, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్‌ ప్రత్యూష సుబ్బారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement